Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూఎస్ ఎంబసీ సిబ్బంది నోట 'బాలీవుడ్' డైలాగులు... పడిపడి నవ్వుతున్న నెటిజన్లు... వీడియో చూడండి!

  • ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ సిబ్బంది తయారు చేసిన బాలీవుడ్ ఆడిషన్ ఫన్నీ వీడియో
  • సోషల్ మీడియాలో వైరల్
  • తలైవా డైలాగులు ట్రై చేయండంటూ సలహాలు
న్యూఢిల్లీలోని యూఎస్‌ రాయబార కార్యాలయం తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా పడిపడి నవ్వుతున్నారు. యూఎస్ ఎంబసీలోని అధికారులంతా బాలీవుడ్ సినిమా ఆడిషన్ కు హాజరై, హిందీ సినిమా డైలాగులు చెబితే ఎలా ఉంటుందన్నది ఈ వీడియో ఇతివృత్తం.

బాలీవుడ్ కళాఖండం ‘షోలే’ లోని గబ్బర్‌ సింగ్‌ పాప్యులర్ డైలాగ్, అమితాబ్ బచ్చన్ పాప్యులర్ డైలాగ్, ఓం శాంతి ఓంలోని ఏక్ చుట్కీ సింధూర్ డైలాగ్ లను వల్లెవేసిన యూఎస్ ఎంబసీ ఉద్యోగులు నెటిజన్లను నవ్వించారు. 'వీ లవ్‌ బాలీవుడ్‌' అంటూ ఫన్నీ అడిషన్‌ వీడియోను యూఎస్‌-ఇండియా దోస్తీ హ్యాష్‌ ట్యాగ్‌ తో షేర్‌ చేయగా అది వైరల్ అవుతోంది. వారి ప్రయత్నాన్ని అభినందిస్తున్న నెటిజన్లు...ఈ సారి తలైవా తమిళ డైలాగులు ట్రై చేయండని సలహా ఇస్తున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి. 
usa
us ambassadors
funny video
viral video

More Telugu News